: వరదలతో చైనా అతలాకుతలం
సౌలిక్ తుపాను వరదలతో చైనా అతలాకుతలమౌతోంది. గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎడతెరిపిలేని వానలు చైనాను ముంచెత్తడంతో వరదలు ముంచుకొచ్చాయి. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు 12 మంది మృతి చెందగా, మరో 11 మంది గల్లంతయ్యారు. చైనా నైరుతి ప్రాంతంలో ఉన్న సిచువాన్ ప్రావిన్స్ కు వర్షాల తాకిడి విపరీతంగా ఉంది. దీంతో ఇక్కడ మూడు వంతెనలు కూలిపోయాయి. వరదల తాకిడికి గ్వాంగ్జూ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.