: రాజకీయాల్లోకి దోపిడీదొంగలొస్తున్నారు: బాబు ఆవేదన


దోపిడీ దొంగలు, నేరస్తులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని, ఇలాంటి వారితో రాజకీయ విలువలు పతనమవుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన బాబు రాజకీయాలు-అవినీతిపై మాట్లాడారు. అసమర్థ, అవినీతి పాలన వల్ల దేశం శక్తులుడిగిపోతోందని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే వారిలో కొందరు దోచుకుని దాచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. స్వార్థపరుల కారణంగా రాజకీయాలు కలుషితమయ్యాయని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News