: మళ్లీ బీజేపీలోకి యడ్యూరప్ప?


ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పాలిట విలన్ లా తయారైన యడ్యూరప్ప.. మళ్లీ పాతగూటికి చేరేందుకు తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు సంకేతాలు వెలువరిస్తున్నారు. బెంగళూరులో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేతలు తనను సంప్రదిస్తున్నారని తెలిపారు. యడ్యూరప్ప బీజేపీలో ఉన్నప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో అవినీతి ఆరోపణలతో పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. అనంతరం బీజేపీ పార్టీ నుంచీ వైదొలగకతప్పలేదు.

కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) పేరిట వేరు కుంపటి పెట్టుకున్న యడ్యూరప్ప మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఓట్లను భారీగా చీల్చి పరోక్షంగా కాంగ్రెస్ కు సాయపడ్డాడు. ఈ నేపథ్యంలో దక్షిణాదిన మళ్లీ శక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతోంది. ఈ క్రమంలో యడ్యూరప్పను తిరిగి పాతగూటికి ఆహ్వానించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News