: రాయ్ బరేలీలో జాతీయ విమానయాన యూనివర్సిటీ


సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలి నియోజకవర్గానికి మరో ఘనత తెచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాయ్ బరేలీలో రాజీవ్ గాంధీ జాతీయ విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర మంత్రి వర్గం ఈ రోజు ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో ఐటీడీసీ, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ పెట్టుబడుల ఉపసంహరణ, పౌర విమానయాన సంస్థ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ప్రతిష్ఠాత్మకమైన విమానయాన విశ్వవిద్యాలయాన్ని రాయ్ బరేలీలో ఏర్పాటు చేస్తారు.

  • Loading...

More Telugu News