: థానే జిల్లాలో వింత శబ్దాలు.. భయాందోళనలో ప్రజలు
మహారాష్ట్రలోని థానే జిల్లా గిరిజన ప్రాంతం జవహర్ లో ఈ ఉదయం భూమి నుంచి వింత శబ్దాలు వినిపించాయి. కొంచెం మంద్రస్థాయిలో భూగర్భం నుంచి వెలువడిన ఈ ధ్వనులు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. ఈ ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ శబ్దాలు విన్న వెంటనే ప్రజలు ఇళ్ళల్లోంచి బయటకు పరుగులు తీశారు. తొమ్మిది గంటలవరకు ఈ వింత ధ్వనులు వస్తూనే ఉన్నాయని జవహర్ ప్రాంత పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఇలాగే గతేడాది కూడా భూమినుంచి శబ్దాలు వచ్చాయని ఆ అధికారి గుర్తు చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనతో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.