: నేటి నుంచే యాషెస్ సమరం


ఓ పత్రిక చేసిన వ్యాఖ్యలతో 'బూడిద' (యాషెస్) సమరంగా పేరు పడ్డ యాషెస్ సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది. దాయాదుల మధ్య హోరా హోరీగా జరుగనున్న ఈ సమరంలో పోరాడేందుకు ఆసీస్, ఇంగ్లాండ్ సిద్దమయ్యాయి. నువ్వా? నేనా? అనే రీతిలో జరిగే యాషెస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఉంది. భారత్- పాక్ మ్యాచ్ అంటే ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో అలాంటి భావోద్వేగాలే యాషెస్ సిరీస్ లో కూడా ఉంటాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతి మ్యాచ్ కూ అభిమానులు టికెట్ల కోసం పోటీ పడతారు. అలాగే సిరీస్ మొత్తానికి టికెట్లు అమ్ముడుపోయాయి. నేడు ప్రారంభం కానున్న ఈ సిరీస్ విజేతగా నిలిచే అవకాశం నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ దే అని విశ్లేషకులు చెబుతున్నా, యాషెస్ సిరీస్ అంటే ఏదైనా జరగొచ్చు. అందుకే విజయం కోసం రెండు జట్లు కొదమసింహాల్లా తలపడతాయి.

  • Loading...

More Telugu News