: చంద్రుడు, శుక్రుడు ఎదురుపడనున్నారు
ఈ రోజు రాత్రి ఆకాశంలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు, శుక్రుడు ఇద్దరూ ఒకరికి ఒకరు సమీపంగా రానున్నారు. రాత్రి 11.48 నిమిషాలకు వారిద్దరూ దగ్గరగా వస్తారు. చంద్రవంక ఎడమవైపు పైభాగంలో ప్రకాశవంతంగా శుక్రుడు కనిపిస్తాడు. సాధారణంగా ఈ గ్రహాలు చాలా దూరంగా ఉంటాయి. అయితే ఏడాదిలో ఒకసారి మాత్రం దగ్గరగా వస్తాయి. భూమి నుంచి వీటిని స్పష్టంగా చూడవచ్చని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సెక్రటరీ రఘునందన్ కుమార్ తెలిపారు.