: ఫైనల్ మ్యాచ్ కు ధోనీ నాయకత్వం: కోహ్లీ
వెస్టిండీస్ గడ్డపై ముక్కోణపు వన్డే సిరీస్ లో ఫైనల్స్ కు చేరుకోవడంతో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ కోహ్లీ పరమానంద భరితుడు అవుతున్నాడు. విజయం అతడిని ఉబ్బితబ్బిబ్చు చేస్తోంది. జట్టులోని ఆటగాళ్ల ప్రతిభను చూసి గర్విస్తున్నానంటూ కోహ్లీ ప్రకటించేశాడు. ప్రారంభ మ్యాచులలో ఓడినా.. తర్వాతి మ్యాచులలో ఘన విజయాలు భారత జట్టు సత్తాకు నిదర్శనమన్నాడు. శ్రీలంకపై విజయం సమష్టి విజయంగా అభివర్ణించాడు. అన్ని విభాగాల్లోనూ రాణించామన్నాడు. శ్రీలంకతో జరిగే ఫైనల్స్ లో జట్టుకు ధోనీ నేతృత్వం వహించే అవకాశం ఉందని చెప్పాడు.