: సచివాలయం వైపు కదం తొక్కిన కార్మికులు


రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏఐటీయూసీ కార్మిక సంఘం చేపట్టిన చలో సచివాలయం నిరసన గరం గరంగా మారిపోయింది. కార్మికులు పెద్ద ఎత్తున సచివాలయం వైపు కదంతొక్కారు. దీంతో హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి సచివాలయం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. సచివాలయం వైపు దూసుకువస్తున్న కార్మికులను ఆలోపే పోలీసులు అడ్డగించారు. అందరినీ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్బంగా పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. 

  • Loading...

More Telugu News