: చురుగ్గా రుతుపవనాలు.. వర్షసూచన
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటికి తోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, చత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో వచ్చే 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయని తెలిపింది.