: చెన్నయ్ నగరంలో ఇడ్లీ రూపాయే
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత అల్పాదాయ వర్గాల కోసం బడ్జెట్ క్యాంటీన్లను ప్రారంభించారు. మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ క్యాంటీన్లలో 100 గ్రాముల ఇడ్లీ రూపాయికే అందిస్తారు. 350 గ్రాముల సాంబారు అన్నం రూ. 5... 350 గ్రాముల పెరుగన్నం ధర 3 రూపాయలుగా నిర్ణయించారు.
ఈ క్యాంటీన్లను ప్రారంభించిన జయ స్వయంగా వడ్డించడం విశేషం. మహిళా స్వయం సహాయక బృందాలు నిర్వహించే ఈ క్యాంటీన్లలో పరిశుభ్రతతో కూడిన రుచికరమైన వంటకాలను అందించాలని ఆమె అధికారులకు సూచించారు. చెన్నయ్ లో 1000 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్టు జయ ప్రకటించారు.