: అమ్మకడుపులోనే ఆరోగ్య నిర్ణయం


మనం అమ్మ కడుపులో ఉండగానే మన వయసు, ఆరోగ్యం నిర్ణయం అయిపోతాయట. మనం పుట్టడానికి ముందు అమ్మ కడుపులో ఉండగానే మనకు సంబంధించిన దీర్ఘకాల ఆరోగ్యం, వృద్ధాప్య రేటుకు సంబంధించిన మార్పులు మన రక్తంలో జరిగిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌ పరిశోధకులు కవలలపై చేపట్టిన పరిశోధనలో జీవక్రియకు అవసరమైన కొత్తరకం పదార్ధాలను వారు రక్తంలో గుర్తించారు. ఈ పదార్ధాలు పుట్టడానికి ముందు గర్భంలో లేదా శిశుదశలోనే ఒక వ్యక్తి దీర్ఘకాల ఆరోగ్యం, వృద్ధాప్య రేటుకు సంబంధించిన సంకేతాలను తెలియజేస్తాయని వీరు గుర్తించారు. కవలలపై వీరు చేపట్టిన పరిశోధనలో మెటబాలిక్‌ ప్రొఫైలింగ్‌ అనే ప్రక్రియ ద్వారా వృద్ధాప్యానికి 22 జీవక్రియ కారకాలు కారణమవుతున్నట్టు పరిశోధకులు నిర్ధారించారు.

వీటిలో సీ-జీఎల్‌వైటీఆర్‌పీ అనే జీవక్రియ కారకానికీ, ఊపిరితిత్తుల పనితీరు, ఎముక సాంద్రత వంటి వృద్ధాప్య లక్షణాలతో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు, బిడ్డ పుట్టే సమయంలో వుండే బరువుకు కూడా వీటితో సంబంధం ఉన్నట్టు తెలిపారు. పుట్టినప్పుడు మంచి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఒక సంకేతంగా భావిస్తారు. అలాగే ఇలాంటి వృద్ధాప్య మార్కర్లయిన జీవక్రియ కారకాలను భవిష్యత్తులో సాధారణ రక్తపరీక్షతో కూడా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News