: టాస్ ఓడినా బ్యాటింగ్ మనదే..
కీలక మ్యాచ్ లో భారత్ టాస్ ఓడింది. ముక్కోణపు సిరీస్ లో భాగంగా జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో భారత్ నేడు లంకతో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ చేరతారన్న నేపథ్యంలో టీమిండియాను టాస్ వెక్కిరించింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ ఈ మ్యాచ్ కు వేదిక. కాగా, ధోనీ స్థానంలో జట్టులో కొచ్చిన తెలుగుతేజం రాయుడు మరోసారి రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. తమిళనాడు ఓపెనర్ మురళీ విజయ్ కు తుదిజట్టులో స్థానం కల్పించారు.