: టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ ఇదే..
భారత జట్టు ముందర మరో కఠిన పరీక్ష నిలిచింది. పేసర్లకు స్వర్గధామంలా నిలిచే దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఓ భారీ సిరీస్ ఆడనుంది. ధోనీ సేన ఈ సుదీర్ఘ పర్యటనలో మూడు టెస్టులు, ఏడు వన్డేలు, రెండు టి20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసింది. తొలుత నవంబర్ 18న దక్షిణాఫ్రికా ఇన్విటేషన్ ఎలెవన్ జట్టుతో ప్రాక్టీసు మ్యాచ్ ఉంటుంది. అనంతరం టి20 మ్యాచ్ లు, వన్డేలు, చివరగా టెస్టు సిరీస్ నిర్వహిస్తారు.
షెడ్యూల్ వివరాలు..
మొదటి టి20- నవంబర్ 21 (జొహాన్నెస్ బర్గ్)
రెండవ టి20- నవంబర్ 24 (కేప్ టౌన్)
మొదటి వన్డే- నవంబర్ 27 (డర్బన్)
రెండో వన్డే-నవంబర్ 30 (పోర్ట్ ఎలిజబెత్)
మూడో వన్డే- డిసెంబర్ 3 (ఈస్ట్ లండన్)
నాలుగో వన్డే- డిసెంబర్ 6 (సెంచూరియన్)
ఐదో వన్డే- డిసెంబర్ 8 (జొహాన్నెస్ బర్గ్)
ఆరో వన్డే- డిసెంబర్ 12 (బ్లూమ్ ఫోంటీన్)
ఏడో వన్డే- డిసెంబర్ 15 (కేప్ టౌన్)
మొదటి టెస్టు- డిసెంబర్ 26-30 (డర్బన్)
రెండో టెస్టు- జనవరి 2-6 (కేప్ టౌన్)
మూడో టెస్టు- జనవరి 15-19 (జొహాన్నెస్ బర్గ్)