: ఈ సూపర్ ఎల్ఈడీ టీవీ రేటు 7వేలే
ఎఒసి కంపెనీ ఎల్ఈడీ టీవీని అతి తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎల్ఈ16ఎ1333/61 మోడల్ గల ఈ టీవీ ఖరీదు 6,990 రూపాయలు. రియల్ కలర్ ఇంజన్ టెక్నాలజీ వినియోగించడం వల్ల రంగులు సహజంగా అనిపిస్తాయని కంపెనీ తెలిపింది. 15.6 అంగుళాల ఈ టీవీలో యూఎస్ బీ, హెచ్ డీఎంఐ, వీజీఎ పోర్టులు కూడా ఉన్నాయి. ట్యూబులైటుకు అయ్యేంత కరెంటు మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. దీని బరువు 1250 గ్రాములు(కేజీ పావు) మాత్రమే.