: సిటీలైట్ పక్క భవనం కూల్చివేతకు నిర్ణయం
సికింద్రాబాద్, రాష్ట్రపతి రోడ్డులో కుప్పకూలిన సిటీలైట్ హోటల్ భవనానికి ఆనుకుని ఉన్న భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. హోటల్ కూలడం వల్ల పక్కనున్న భవనానికీ ముప్పు వాటిల్లుతుందన్న అంచనాతో ఈ నిర్ణయానికి వచ్చారు. మరోవైపు మంగళహాట్ ప్రాంతంలో ఒక పురాతన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేస్తున్నారు. నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో, ప్రమాదాలకు తావు ఇవ్వరాదనే ఉద్దేశంతో భవనాన్ని తొలగిస్తున్నారు.