: షిర్డీలో రోడ్డు ప్రమాదం.. తెలుగువారికి గాయాలు
షిర్డీలో రోడ్డు ప్రమాదంలో తెలుగువారికి గాయాలయ్యాయి. భక్తులతో వెళుతున్న ప్రైవేటు బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బస్సులోని 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని సమాచారం. వీరంతా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినవారని పోలీసులు తెలిపారు.