: విండీస్ పై శ్రీలంక ఘన విజయం.. భారత్ కు విషమ పరీక్ష


భారత్ ను భారీ తేడాతో మట్టికరిపించిన శ్రీలంక అదే దూకుడుతో నిన్న జరిగిన మ్యాచులోనూ విండీస్ పై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. 39 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. వర్షం కారణంగా ఆదివారం నిలిచిపోయిన స్కోరు నుంచి శ్రీలంక నిన్న బ్యాటింగ్ కొనసాగించింది. 41 ఓవర్లకు ఆటను కుదించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అయితే, విండీస్ విజయ లక్ష్యాన్ని 230 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్ ఒత్తిడిలో 31 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. బ్రావో 70, సిమన్స్ 67 పరుగులతో ఆదుకున్నారు. వీరి తర్వాత ఇంకెవరూ నిలదొక్కుకోకపోవడంతో 41 ఓవర్లలో విండీస్ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది.

శ్రీలంక చక్కటి విజయం సొంతం చేసుకోవడంతో దాదాపుగా ఆ జట్టు ఫైనల్ కు చేరుకున్నట్లే. ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో భారత్ తప్పకుండా గెలిచి తీరాలి. అప్పుడే ఫైనల్ కు చేరుకోగలదు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీనికి కూడా కోహ్లీయే నేతృత్వం వహించనున్నాడు.

  • Loading...

More Telugu News