: బయటి గ్రహాల్లోని నీటిజాడ తెలుసుకోవచ్చు


సౌరకుటుంబం వెలుపల బోలెడన్ని గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. ఇలాంటి గ్రహాలపై నీటి జాడలు ఏవైనా ఉన్నాయా? అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తించలేకపోతున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు తాము రూపొందించిన పద్ధతిలో సౌరకుటుంబం వెలుపల ఉన్న గ్రహాల్లో నీటి జాడను చక్కగా గుర్తించవచ్చని చెబుతున్నారు.

నెదర్లాండ్స్‌కు చెందిన లీడెన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు సౌరకుటుంబం వెలుపలి గ్రహాల్లో నీటి జాడను గుర్తించేందుకు ఒక సరికొత్త పద్ధతిని రూపొందించారు. ఈఎస్‌వోకు చెందిన అతి భారీ టెలిస్కోపు (వీఎల్‌టీ)ను ఉపయోగించి తాము చేపట్టిన పరిశోధనా పద్ధతిలో సౌరకుటుంబం బయటి గ్రహాల్లో నీటి జాడను గుర్తించేందుకు చేస్తున్న ప్రయత్నాలు మరింత మెరుగయ్యాయని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఈ పద్ధతి వల్ల అంతరిక్షానికి సంబంధించిన టెలిస్కోపుల అవసరం ఉండదని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము రూపొందించిన పద్ధతిలో నీటి జాడతోబాటు ఇతర అంశాలను కూడా గుర్తించవచ్చని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News