: గణేశుడికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు


హిందూ దేవతల్లో గణేశుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆకారంలోనే కాదు అన్నింటా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి గణేశుడు జర్మనీ టంకశాలను ఆకర్షించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నాణేలను విక్రయించేందుకు గుర్తింపు ఉన్న ఏజీ ఇంపెక్స్‌ సంస్థ ఎంచక్కా గణేశుడి బొమ్మతో కూడిన నాణేలను ముద్రించడం మొదలుపెట్టింది. అంతేకాదు వీటిని ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయడం కూడా ప్రారంభించేసింది.

త్వరలోనే గణేశ చతుర్ధి రానుంది. ఈ విషయంతోబాటు ప్రపంచ వ్యాప్తంగా గణేశుడికి, ఆయన రూపానికి ఉన్న డిమాండును చక్కగా ఉపయోగించుకోవాలనుకున్న జర్మనీ టంకశాల గణేశుడి బొమ్మతో కూడిన వెండి నాణేలను ముద్రించడానికి పూనుకుంది. వీటిని పశ్చిమ ఆఫ్రికాలోని 'ఐవరీ కోస్ట్‌' ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేస్తోంది కూడా. శుద్ధమైన వెండితో పరిమితంగా తయారు చేసిన ఈ నాణెంపై గణేశుడి బొమ్మతోబాటు 'వక్రతుండ మహాకాయ' అనే సంస్కృత శ్లోకాన్ని కూడా ముద్రించారు. చక్కటి స్ఫటికాలు పొదిగిన ఈ నాణెం ఒక్కొక్కటి 25 గ్రాముల బరువుంటుంది. దీని ఖరీదు కూడా రూ..8001 మాత్రమే. త్వరలో రానున్న వినాయక చవితిని దృష్టిలో ఉంచుకుని ఈ నాణేన్ని విడుదల చేశారు. మన దేశంలో దేవుళ్ల బొమ్మలతో ఎలాంటి నాణేలు ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. దీంతో వినాయకుడికి ఉన్న డిమాండును దృష్టిలో ఉంచుకున్న జర్మనీకి చెందిన టంకశాల వారు వీటి ముద్రణ ప్రారంభించారు. వీటికి సంబంధించి ఇప్పటికే పలు ఆర్డర్లను తీసుకుంటున్నామని కోల్‌కతాలోని ఏజీ ఇంపెక్స్‌ చెబుతోంది.

  • Loading...

More Telugu News