: సడక్ బంద్ ను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రం: ఈటెల
'సడక్ బంద్' కు మద్దతుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన బస్సుయాత్ర హైదరాబాదు టీఆర్ఎస్ఎల్వీ నుంచి ప్రారంభమైంది. ఇక్కడి నుంచి యాత్ర మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, సడక్ బంద్ ను అడ్డుకుంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాత్ర విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, రేపటిలోగా ఉద్యమకారులపై పెట్టిన బైండోవర్ కేసులు ఎత్తివేయాలని కోరారు.