: నితీష్ కుమార్ పై దిగ్విజయ్ సింగ్ నిప్పులు
బుద్ధగయలో ఉగ్రవాద దాడులపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, మహాబోధి ఆలయంపై తీవ్రవాదులు దాడులు చేసే అవకాశముందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ భద్రతా చర్యలు తీసుకోకుండా, వాటి బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని మండిపడ్డారు. జరిగిన ఘటనపై ఇంటెలిజెన్స్ అధికారులు, జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర నివేదిక సమర్పించే వరకూ సంయమనం పాటించాలని, బీజేపీ నాయకులు తొందరపడి ఏ నిర్ణయానికీ రావొద్దని సూచించారు. జరిగిన ఘటనను బీజేపీ రాజకీయం చేస్తోందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు.