: బుద్ధగయ పేలుళ్ల అనుమానితుడు అరెస్ట్.. విచారణ


తథాగతుడి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బుద్ధగయలో 28 నిమిషాల్లో జరిగిన 9 బాంబు పేలుళ్ల కేసులో అనుమానితుడ్ని జాతీయ దర్యాప్తు సంస్ధ ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం రంగప్రవేశం చేసిన ఎన్ఐఏ నిపుణులు తమదైన శైలిలో వివరాలు సేకరించారు. సంఘటనా స్థలంలో లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా గయలోని బారాఛట్టీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇంకో వైపునుంచి మొత్తం వీడియో పుటేజీని పరిశీలిస్తున్నారు. గుడిలో ఉన్న సీసీ కెమేరాలన్నీ పని చేస్తుండడంతో నిందితుడి ఆచూకీ లభించే అవకాశముంది. జరిగిన దాడిలో భద్రతా వైఫల్యం లేదని నిపుణులు నిర్ధారించారు. పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఇప్పటికే కేంద్ర హోంశాఖకు ఎన్ఐఏ అధికారులు అందజేశారు. దాడిలో ప్రాణనష్టం సంభవించకున్ననూ శాంతికాముకుడైన బుద్ధభగవానుడి ప్రాంగణంలో జరిగిన బాంబు దాడుల్ని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.

  • Loading...

More Telugu News