: మాజీ మంత్రి అసహజ శృంగారంపై కేసు నమోదు
పనిమనిషితో స్వలింగ సంపర్కానికి పాల్పడి మంత్రి పదవి పోగొట్టుకున్న మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే రాఘవ్ పై పోలీసులు ఐపీసీ 370, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. మరోవైపు తప్పుడు పనులకు పాల్పడి పార్టీ పరువుకు మచ్చతెచ్చినందున రాఘవ్ పై బీజేపీ బహిష్కరణ వేటు వేసింది. తనకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి, స్వలింగ సంపర్కం చేశాడంటూ రాఘవ్ పై పనిమనిషి పోలీసులకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.