: డీఎన్‌ఏని మార్చే వ్యాయామం
మీ డిఎన్‌ఏని మార్చేసుకోవాలనుకుంటున్నారా... అయితే చక్కగా వ్యాయామం చేయడం మొదలుపెట్టండి. కేవలం కొద్దిపాటి వ్యాయామం చేస్తే చాలు, మీ డిఎన్‌ఏ మారిపోతుందంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలను నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తుందట.
కొద్దిపాటి వ్యాయామం చేస్తే అది మిమ్మల్ని స్థూలకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలనుండి కాపాడుతుందని స్వీడన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాయామం వల్ల సంభవించే శారీరకపరమైన మార్పు నేరుగా కొవ్వు కణాలపై తమ ప్రభావాన్ని చూపుతుందని వారు చెబుతున్నారు. అలాగే కొవ్వు కణాలను ప్రభావితం చేసే జన్యువులపై వ్యాయామం నేరుగా ప్రభావాన్ని చూపుతుందని, వాటి తీరునే మార్చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వ్యాయామం వల్ల మనకు సంక్రమణ వల్ల వచ్చే జన్యువులను మార్చలేము కానీ, జన్యు భావ వ్యక్తీకరణను ప్రభావితం చేసే కొన్ని గ్రూపులను మాత్రం వ్యాయామం చాలా రకాలుగా మార్చే వీలుంటుంది. ఈ గ్రూపులను 'మిథైల్ గ్రూపులు' అంటారు. ఈ గ్రూపులను మనం తినే ఆహారం, మన జీవన శైలి, మనం చేసే వ్యాయామం తదితర అంశాలు ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.