: కేసీఆర్ పై వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు
కేసీఆర్ పై తెలంగాణ మాదిగ దండోరా తిరుగుబాటును ప్రకటించింది. ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణ పది జిల్లాల్లో దండోర వేయిస్తామని టీఆర్ఎస్ బహిష్కృత నేత చింతా స్వామి ప్రకటించారు. వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు తిరుగుబాటును హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభించారు. కేసీఆర్ ను ఫాం హౌస్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి తరిమి కొట్టే రోజు ముందుందని హెచ్చరించారు. ఈ ఆందోళనలో కేసీఆర్ సోదరుని కుమార్తె రమ్య పాల్గోని మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి చింతా స్వామిని బహిష్కరించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కేసీఆర్ కు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను చేపట్టారు.