: అప్రమత్తమైన హైదరాబాద్... దొరికిన లక్ష నకిలీ నోట్లు


బీహార్ బాంబు దాడులతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అప్రమత్తమైంది. నగరంపై ఉగ్రవాదులు ఏవైపు నుంచి పంజా విసురుతారోనని పోలీస్ యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. కోఠి, దిల్ షుక్ నగర్ దుర్ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలైన షాపింగ్ మాల్స్, సినిమా ధియేటర్లకు నకిలీ బాంబులతో వెళ్లి తనిఖీలు నిర్వహించారు. గుర్తించకుండా వదిలేసిన షాపింగ్ మాల్స్, సినిమా ధియేటర్లకు నోటీసులు జారీ చేశారు.

మరో ఘటనలో తనిఖీలు చేపట్టిన పోలీసులకు సికింద్రాబాద్ లో లక్షరూపాయల నకిలీ నోట్లతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. వీర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు నకిలీ నోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయంటూ విచారణ చేస్తున్నారు. నగరం మొత్తాన్ని పోలీసులు తనిఖీలతో జల్లెడ పడుతున్నారు.

  • Loading...

More Telugu News