: కార్టూనిస్టులకు అపార అవకాశాలు: శ్రీధర్
కార్టూనిస్టులకు అపార అవకాశాలు ఉన్నాయని ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ అన్నారు. అమెరికాలోని డల్లాస్ లో నాట్స్ ముగింపు వేడుకల్లో శ్రీధర్ పాల్గొన్నారు. గంభీరమైన విషయాలను కూడా సున్నితంగా, హాస్యంగా చెప్పగలగడం కార్టూన్ల వల్లే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా ఐ, సి ఆంగ్ల అక్షరాలతో కార్టూన్లను ఎలా గీయవచ్చో శ్రీధర్ అక్కడి వారికి వివరించారు.