: ఎనిమిది నగరాలు అప్రమత్తం


బీహార్లోని ఆధ్యాత్మిక క్షేత్రం బుద్ధగయలో పేలుళ్లు జరగడంతో కేంద్ర హోంశాఖ ఎనిమిది నగరాలను అప్రమత్తం చేసింది. హైదరాబాద్, పుణె, ఢిల్లీ, కోల్ కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలలోని పోలీసులకు ఈ మేరకు సూచనలు జారీ అయ్యాయి. మరోవైపు పేలుళ్ల కారణంగా మహాబోధి ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి తెలిపారు. ఈ కేసును ఎన్ఐఏ బృందం దర్యాప్తు జరుపుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News