: తన సంపదలో అధిక భాగాన్ని సమాజసేవకే వినియోగిస్తున్న విప్రో అధినేత
మహాత్మా గాంధీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మీద రకరకాలుగా వుంటుంది. ఐటీ దిగ్గజం విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ జీ మీద కూడా గాంధీ ప్రభావం బాగా వుంది. 'మీ దగ్గరున్న సంపద మీ సొంతం కాదు. దానికి మీరు కేవలం ధర్మకర్తలు మాత్రమే. ఆ ధనాన్ని సమాజాభివృద్ధికి వెచ్చించాలి' అని చెప్పిన గాంధీ మాటలను తాను అక్షరాలా పాటిస్తున్నట్టు అజీమ్ ప్రేమ్ జీ చెప్పారు.
తన సంపదలో అధిక భాగాన్ని సమాజ సేవకు వెచ్చిస్తున్నట్టు ప్రేమ జీ వెల్లడించారు. 'అజీమ్ ప్రేమ జీ ఫౌండేషన్' పేరిట ఓ సంస్థను నెలకొల్పి, దాని ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. విప్రో సంస్థ విజయం సాధించిన తర్వాత, తన దగ్గరున్న డబ్బును ఏం చేయాలన్న ఆలోచన వచ్చిందనీ, అప్పుడే సమాజ సేవకోసం ఈ ఫౌండేషన్ నెలకొల్పడం జరిగిందనీ ప్రేమ జీ తెలిపారు.