: అరకిలో బంగారం, కిలో వెండితో దోపిడీ ముఠా అరెస్టు
ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లలోకి చొరబడి, బంగారు ఆభరణాల దోపిడీకి పాల్పడుతున్న దొంగల ముఠాను వరంగల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో వరుస దోపిడీలకు పాల్పడిన ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నుంచి అరకిలో బంగారు ఆభరణాలు, కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా మహబూబాబాద్ సబ్ డివిజన్ పరిథిలో 29 కేసుల్లో నిందితులుగా ఉన్నారని వరంగల్ రూరల్ ఎస్పీ వెల్లడించారు. వీరి నుంచి సొమ్ము రికవరీ చేసి, రిమాండుకు తరలిస్తున్నామని తెలిపారు. దొంగలను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేశారు.