: విభజిస్తే మూడు ముక్కలు చేసెయ్యండి: సాయి ప్రతాప్
రాష్ట్రాన్ని విభజిస్తే మూడు ముక్కలు చేసేయ్యండని ఎంపీ సాయి ప్రతాప్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమేదైనా ఉందంటే అది ఇదేనని ఘంటాపధంగా ప్రకటించారు. ఎనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలను పెట్టుకుని ఎవరికి నచ్చినట్టు వారు విభజనపై వ్యాఖ్యానిస్తున్నారన్న ఎంపీ, విభజనే ఆమోదయోగ్యమనుకుంటే మూడు ప్రాంతాల విభజన అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమని అన్నారు. కావాలంటే మూడు ప్రాంతాల నేతలను కానీ, ప్రజలను కానీ అడిగి చూడండని విలేకర్లకు సూచించారు. మూడు ముక్కలు చేసేస్తే ఎక్కడా అల్లర్లు జరగవని, ఎవరికీ అన్యాయమైపోయామన్న బాధ ఉండదని, ఎవర్ని వారు పరిపాలించుకోవచ్చని సూచించారు.