: విభజనపై నేను క్లియర్... నా స్వరం మారదు: జేడీ శీలం
తాను క్లియర్ గా ఉన్నానని రాష్ట్ర విభజనపై తన స్వరం మారదని కేంద్ర మంత్రి జేడీ శీలం స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా తనది జాతీయ వాదమని, వ్యక్తిగతంగా ఆది నుంచీ తాను సమైక్యవాదినని జేడీ శీలం మరోసారి స్పష్టం చేశారు. విభజన అంశం చాలా సున్నితమైనదన్న ఆయన, కాంగ్రెస్ అధిష్ఠానం ఈ విషయంలో సముచితమైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అలాగే రెచ్చగొట్టే ప్రాంతీయ, ఉప ప్రాంతీయ వాదులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.