: కోహ్లీకి జాక్ పాట్.. అతడి సారధ్యంలో జింబాబ్వేకు భారత్
కోహ్లీకి కలిసొచ్చిన కాలంలా ఉంది. ఇప్పటికే విండీస్ గడ్డపై రెండు మ్యాచులలో భారత జట్టుకు సారధ్యం వహించే అవకాశాలను విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు. విండీస్ లో ముక్కోణపు వన్డే సిరీస ముగిసిన తర్వాత జింబాబ్వేకు వెళ్లే జట్టుకూ ఇతడే సారధ్యం వహించబోతున్నాడు. ఈ మేరకు బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. ధోనీకి విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో కోహ్లీకి అవకాశమిచ్చారు. భువనేశ్వర్ కుమార్, అశ్విన్, ఉమేశ్ యాదవ్ లకు విశ్రాంతి కల్పించారు. మన హైదరబాదీ అంబటి రాయుడుకి చోటు లభించింది.
విరాట్ కోహ్లీ, శిఖర్ దావన్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, అమిత్ మిశ్రా, అంబటి రాయుడు, జయదేవ్, మహ్మద్ షామి, రవీంద్ర జడేజా, మోహిత్ శర్మ, ఆర్. వినయ్ కుమార్, పర్వేజ్ రసూల్, దినేశ్ కార్తీక్ జింబాబ్వేకు పయనం కానున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ జింబాబ్వాపై కప్పు గెలిచి వస్తే.. భవిష్యత్ కెప్టెన్ కోహ్లీయేననడంలో సందేహం లేదు.