: పడుచును పెళ్ళాడిన పండుటాకు!


పెళ్ళికి వయసుతో పనేమిటంటున్నాడు ఇరాక్ లోని ఓ ముదుసలి రైతు. 92 ఏళ్ళ ఈ పండుటాకు ఇటీవలే 22 ఏళ్ళ పడుచును పరిణయమాడాడు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు సమీపంలోని ఓ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వృద్ధుడిపేరు మహ్మద్ అల్ ముజామాయ్ కాగా, నవ వధువు పేరు మునా ముక్లిఫ్ అల్ జుబూరి అని తెలుస్తోంది. తన మొదటి భార్య మూడేళ్ళక్రితం చనిపోగా.. ఇన్నాళ్ళకు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనిపించిందని ముసిముసినవ్వులు నవ్వుతూ చెప్పాడీ ముదుసలి వరుడు.

ఇంతకీ మనవాడికి 16 మంది సంతానమట. వారికీ పిల్లలున్నారు. ఈ పెద్దాయన పెళ్ళి సందడిలోనే మరో ఇద్దరు మనవలూ తమ పెళ్ళిళ్ళు కానిచ్చేశారట. ముజామాయ్ వివాహ తంతు ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, మునాతో నిఖా అనంతరం 20 ఏళ్ళ కుర్రాడిలా ఫీలవుతున్నానని ఖుషీగా చెప్పాడు.

  • Loading...

More Telugu News