: గుడ్లు గుట్టును చెప్పే ఫ్రిజ్!
మీ ఇంట్లోని ఫ్రిజ్‌లోని ఎగ్ ట్రేలో ఎన్ని గుడ్లు ఉన్నాయో మీరు మరచిపోయారనుకోండి, మీరు ఆఫీసులో ఉన్నా కూడా ఎన్ని ఉన్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు. లేదా సరుకులు కొనేందుకు సూపర్‌మార్కెట్‌కు వెళ్లినా కూడా ఇంట్లో ఎన్ని గుడ్లు ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనకు కావాల్సినన్ని కొనుక్కోవచ్చు. ఈ విధంగా గుడ్లు లెక్కను తెలియజెప్పే ఒక కొత్త యాప్‌ను తయారు చేశారు గే మరియు క్విర్కే అనేవారు.
ఫ్రిజ్‌లో మనం గుడ్లు పెట్టేందుకు ఎగ్ ట్రే వాడుతుంటాం. అయితే వీరు ఒక వైట్ ఎగ్‌ట్రేని తయారు చేశారు. దానికి వై-ఫై చిప్‌ను అమర్చి, దానికి ఇంటర్నెట్‌ను అనుసంధానం చేశారు. దీంతో మనం ఎక్కడున్నా కూడా మన ఫ్రిజ్‌లో ఎన్ని గుడ్లు ఉన్నాయో ఇట్టే తెలుసుకోవచ్చంటున్నారు. 14 గుడ్లను పెట్టే అవకాశం ఉన్న ఈ ఎగ్‌ట్రేలో ఎన్ని గుడ్లు ఉన్నాయి అనే విషయానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి గుడ్డు కింద ఉన్న సెన్సర్ బటన్ మన స్మార్ట్ ఫోన్‌కు అందిస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ ఎగ్‌ట్రే లెడ్‌లైట్లతో రూపొందించారు. దీంతో పాత గుడ్లు ఏవో కూడా ఇది ఇట్టే చెప్పేస్తుంది. కేవలం 14 డాలర్ల ధరతో ఈ ట్రే త్వరలో మార్కెట్లో లభ్యం కానుంది.