: 48 కోట్ల మాదక ద్రవ్యాన్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు


48 కోట్ల విలువైన మాదక ద్రవ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న ఇద్దరు టాంజానియా దేశస్థులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఇటీవలే వచ్చిన వీరిద్దరిపై పూర్తి నిఘా ఉంచిన ఢిల్లీ పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేయడంలో సఫలీక్రుతులయ్యారు. నైరోబీ మీదుగా జొహెన్నస్ బర్గ్ వెళ్లేందుకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఈ ఇద్దరినీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సామగ్రిని తనిఖీ చేయగా 60.180 కిలోల తెల్లపొడి (మెటాక్విలోన్) లభించింది. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ 48 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News