: రూట్ మ్యాప్ కాదు, కాంగ్రెస్ మైండ్ మ్యాప్ మార్చుకోవాలి: బీజేపీ
తెలంగాణ అంశంపై రోడ్ మ్యాప్ ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ కోరడం పట్ల బీజేపీ అధికార ప్రతినిధి ఎం.కుమార్ స్పందించారు. తెలంగాణ ప్రజలతో ఆడుకుంటోన్న కాంగ్రెస్ రూట్ మ్యాప్ మార్చుకోవడం కాదని, అర్జెంటుగా మైండ్ మ్యాప్ మార్చుకోవాలని సలహా ఇచ్చారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడి ప్రజల మనోభావాలను కాంగ్రెస్ అపహాస్యం చేస్తోందని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి దేశంలో లభిస్తున్న ఆదరణ తట్టుకోలేక కాంగ్రెస్, సీబీఐని ఆయనపై ప్రయోగిస్తోందని ఆరోపించారు.