: సైడ్ఎఫెక్ట్స్ లేని క్యాన్సర్ చికిత్స
క్యాన్సర్ వచ్చిన వారికి చేసే చికిత్స వల్ల ఇటు వ్యాధి నివారణతోబాటు సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే ఇకనుండి ఇలాంటి సైడ్ ఎఫెక్టులకు ఫుల్స్టాప్ పడనుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని సరికొత్త క్యాన్సర్ చికిత్సకు అవసరమైన సరికొత్త మందును శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కొత్త ఔషధం తయీరీలో తాము పురోభివృద్ధి సాధించినట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ`కోల్కతా) సంచాలకులు సిద్ధార్థ్ రాయ్ తెలిపారు.
క్యాన్సర్ రావడానికి కణాల్లోని పీ53 అనే ప్రోటీన్ దెబ్బతినడమే కారణమని, అది విస్తరించకుండా పూర్తిగా నియంత్రించేందుకు సూక్ష్మ కృత్రిమ పరమాణువులతో ఔషధం రూపొందిస్తున్నామని రాయ్ తెలిపారు. ఈ ఔషధాన్ని ఇప్పటికే జంతువులపై ప్రయోగించామని, దీనివల్ల వాటిలో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదని ఆయన తెలిపారు.