: ఇష్రత్ జహాన్ బీహార్ ఆడపడుచు
గుజరాత్ పోలీసుల బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించిన ఇష్రత్ జహాన్ జన్మస్థానం బీహార్. ఆమె పాట్నాలో జన్మించింది. అయితే ఆమె కుటుంబం 20 ఏళ్ల క్రితం ముంబై వలస వెళ్లింది. పాట్నాలోని ఖాంగ్వాల్ ప్రాంతంలో ఇష్రత్ పుట్టిందని, చిన్నతనంలో తాతగారి ఇంట్లో పెరిగిందని ఆమె మేనమామ ఎం రహ్మాన్ తెలిపాడు. అక్కడి స్థానిక పాఠశాలలో ఇష్రత్ చదువుకుందని కూడా ఆయన తెలిపాడు. ఇష్రత్ బీహార్ ఆడపడుచు అని, ఆమెకు న్యాయం జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని జేడీ(యూ) ఎంపీ అలీ అన్వర్ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అసలు స్వరూపాన్ని ప్రజల కళ్లకు కట్టేలా ప్రచారం చేస్తానన్నారు.