: మౌస్ సృష్టికర్త కన్నుమూత
కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణగా పేర్కొనదగ్గ పరికరం మౌస్. ఈ చిట్టెలుక రూపంలోని 'మౌస్'.. కీబోర్డు ఉపయోగాన్ని గణనీయంగా తగ్గించింది. ఈ అద్భుత సాధనాన్ని కనుగొన్న డగ్లస్ ఏంగెల్ బార్ట్ (88) అమెరికాలో కన్నుమూశారు. 1963లో ప్రాణం పోసుకున్న మౌస్ ఇటీవల కాలంలో ఆధునికీకరణకు లోనైంది. తాజాగా వైర్ లెస్ మౌస్ లు రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.