: సైన్యానికి తలొగ్గిన ఈజిప్టు అధ్యక్షుడు
ప్రజాగ్రహం పెల్లుబికితే రాజ్యాధినేతలు సైతం తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. ఈజిప్టులో జరిగిందదే. ఏడాది క్రితం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా, పదవీకాలంలో తీవ్ర వ్యతిరేక చర్యలకు పాల్పడి ప్రజల మద్దతు కోల్పోయిన ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్ మోర్సీని సైన్యం బలవంతంగా పదవీచ్యుతుడిని చేసింది. కొద్దికాలంగా ప్రజాందోళనలు మిన్నంటుతున్న నేపథ్యంలో సైన్యం మోర్సీకి 48 గంటల గడువు విధించింది. పదవినుంచి తప్పుకోకపోతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. మోర్సీ ఆ హెచ్చరికలను భేఖాతరు చేయడంతో సైన్యం ఆయన్ను బలవంతంగా గద్దె దింపింది. అతని స్థానంలో రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని అధ్యక్షుడిగా నియమిస్తునట్టు సైనిక జనరల్ అబ్దెల్ ఫత్తా అల్సీసీ ప్రకటించారు.