: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం: హరీశ్ రావు


రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వివక్ష చూపుతూ, తమ ప్రాంత ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.

కేంద్రం అంగీకరించినా కాజీపేట రైల్వే డివిజన్ కు భూ సేకరణకు రాష్ట్ర సర్కారు నిధులు కేటాయించడం లేదని ఆయన ఆగ్రహించారు. ఇదిలావుంచితే, ఉద్యోగుల సమస్యల పేరుతో హైదరాబాదులో సీమాంధ్రులు సమైక్యాంధ్ర సదస్సు నిర్వహిస్తే వూరుకునేది లేదని హరీశ్ రావు హెచ్చరించారు.

మరోవైపు 
బుధవారం సడక్ బంద్ తో పాటు  20మంది  ఎమ్మెల్యేలతో మహబూబ్ నగర్ కు బస్సు యాత్ర చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. 

  • Loading...

More Telugu News