: ఇదో 'పడవకారు'!
పడవకారేంటి అనుకుంటున్నారా... అయితే నీళ్లలో తేలుతూ ప్రయాణించేందుకు దేన్ని వాడతాం... పడవనే కదా... అయితే అది కారులాంటి ఆకారంలో ఉంటే అప్పుడేమనాలి...? పడవ కారు అనేగా. ఈ పడవ కారు నేలపైన కూడా నడుస్తుంది. అదే దీని స్పెషాలిటీ.
కాలిఫోర్నియాలోని కార్ల కంపెనీ ఒక కొత్తరకం కారును రూపొందించింది. ఈ కారు పేరు 'పాంథర్'. ఇది చూసేందుకు జీపు తరహాలో ఉంటుంది. 15 అడుగులుండే ఈ పాంథర్లో మనం చక్కగా రోడ్డుపై ప్రయాణం చేయడమే కాదు, ఎంచక్కా నీళ్లలో కూడా బోటులాగా దీనిపై ప్రయాణం చేయవచ్చు. ఈ కారు నీళ్లలో దిగిన 15 సెకన్లలోనే బోటుగా మారిపోయి గంటకు 45 మైళ్ల వేగంతో దూసుకెళుతుంది. ప్రపంచంలో ఇంత వేగంగా నీళ్లపై బోటులా మారిపోయే కారు ఇదొక్కటేనంటున్నారు కంపెనీ వారు.