: ఇలా చేస్తే రోదసిలోకి వెళ్లడం ఈజీ


రోదసిలోకి ప్రయోగ నౌకలను పంపడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే ఈ ఖర్చును తగ్గించేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు నాసా రూపొందించిన తాజా క్రయోజనిక్‌ ట్యాంకు ఇందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

భవిష్యత్తులో రాకెట్లు, అంతరిక్ష నౌకల అవసరాలను తీర్చే ప్రత్యేకమైన ట్యాంకును నాసా రూపొందించింది. భారీ పరిమాణంలో ఉన్న క్రయోజనిక్‌ చోదక ట్యాంకును మిశ్రమ పదార్ధాలతో తయారు చేశారు. దీన్ని నాసా విజయవంతంగా ప్రయోగించింది. ఎనిమిది అడుగుల వ్యాసంతో ఉన్న ఈ మిశ్రమ పదార్దాల ట్యాంకును నాసా మార్షల్‌ స్పేస్‌ ప్లైట్‌ సెంటర్‌లో పరీక్షించారు. భవిష్యత్తులో ఈ ట్యాంకు భారీ మార్పులకు దారి తీస్తుందని, ఎందుకంటే కాంపోజిట్‌ ట్యాంకులు ప్రయోగ నౌకల వ్యయాన్ని, బరువును తగ్గిస్తాయని నాసా అసోసియేట్‌ అడ్మినిస్ట్రేటర్‌ మైఖేల్‌ గజారిక్‌ తెలిపారు. ఇవి తర్వాత తరం అంతరిక్ష ప్రయోగాలకు బాగా ఉపయోగపడతాయని గజారిక్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News