: నడుము నొప్పా... అయితే, ఇదుగో ఉపశమనం!


వారానికోసారి యోగాతో నడుం నొప్పికి ఉపశమనాన్ని పొందవచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వారంలో రెండు సార్లు యోగా చేస్తే నొప్పికి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం కూడా తగ్గుతుందని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకుల బృందం నడుమునొప్పితో బాధపడుతున్న అల్పాదాయ రోగులు వారానికోసారి వైద్యులు ఆమోదించిన యోగా శిక్షణా తరగతికి వెళ్లడంతో సత్ఫలితాలు వచ్చాయని తెలిపింది. ఈ పరిశోధనల్లో తీవ్ర నడుము నొప్పితో బాధపడుతున్న 95 మందిని రెండు విభాగాలుగా విభజించి 12 వారాలపాటు యోగా శిక్షణ తరగతులు ఇచ్చినట్టు, దాంట్లో గణనీయమైన ఫలితాలు సాధించినట్టు బీయూఎన్ఎం కు చెందిన రాబర్ట్ సేపర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News