: మహిళల్లో రాజకీయ పరిజ్ఞానం తక్కువేనట!
పురుషులతో పోలిస్తే మహిళలకు రాజకీయ విషయ పరిజ్ఞానం తక్కువేనని లండన్ లో చేపట్టిన అధ్యయనం వెల్లడించింది. పది దేశాల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ కర్రాన్ తెలిపారు. మహిళల్లో రాజకీయ విషయ పరిజ్ఞానం తక్కువ అనేది ఏదో ఒక దేశానికి పరిమితమైంది కాదని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో చూసినా ఇదే పరిస్థితి కన్పిస్తుందని పరిశోధనలు తెలిపాయని అంటున్నారు.
మహిళల రాజకీయ పరిజ్ఞానం విషయంలో బాగా వెనుకబడిన దేశాల్లో నార్వే ప్రధమస్థానంలో ఉందని తెలిపారు. బ్రిటన్, అమెరికాల్లో నిర్వహించిన అధ్యయనాలు కూడా ఇవే ఫలితాలను వెల్లడించాయి. అందులో ఆశావహ అంశమేంటంటే, ఇప్పుడిప్పుడే యువతరంలో కాస్త వైవిధ్యమైన ఆలోచనలు వచ్చి మహిళల్లో కాస్త రాజకీయ పరిజ్ఞానం కలుగుతోందని అంటున్నారు.