పీవీ విజ్ఞాన వేదిక డిజైన్ లను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భారత మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహరావు నివసించిన గ్రామం వంగర గ్రామమును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయటానికి సుమారు 11 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో పీవీ విజ్ఞాన వేదిక డిజైన్ లను రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తన కార్యాలయంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె యస్ శ్రీనివాస రాజుతో కలసి ఆవిష్కరించారు.
 
ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పీవీ శతజయంతి వేడుకలలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే ఆశయంతో వారి పేరిట పీవీ విజ్ఞాన వేదికను వంగర గ్రామంలో నిర్మిస్తున్నామన్నారు.
 
మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మృతివనం లాగా పీవీ విజ్ఞాన వేదికను తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
 
తెలంగాణ రాష్ట్రం గర్వించే వ్యక్తిగా పట్వారీ నుండి ప్రధానమంత్రిగా ఎదిగిన స్వర్గీయ పీవీ ప్రతి ఓక్కరికి స్పూర్తి ప్రధాతగా నిలిచారన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ ప్రవేశ పెట్టిన సంస్కరణలు, వారి పరిపాలన భవిష్యత్ తరాలకు తెలిసేలా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పీవీ నివసించిన ఇంటిని మ్యూజియంగా, వంగర గ్రామంలో పీవీ పేరుతో సుమారు 8 ఎకరాలలో పీవీ విజ్ఞాన వేదికను రూపోందిస్తున్నామన్నారు.

అందుకు మొదటి దశలో 7 కోట్ల రూపాయలతో పీవీ విజ్ఞాన వేదికలో పీవీ విగ్రహానికి ఫౌంటైన్, లైటింగ్, వారి విజయాలు, పోటో గ్యాలరీ, మోడిటేషన్ సెంటర్, సైన్స్ మ్యూజియం, మేజ్ గార్డేన్, చిల్డ్రన్ ఆట స్థలాలు, స్వాతంత్ర సమరయోధుల శిల్పాలు, యాంఫి థియేటర్, ఫుడ్ కోర్టుల నిర్మాణానికి 686.25 లక్షల రూపాయలను కేటాయించామన్నారు.

పీవీ నివాసమును మోమోరియల్ మ్యూజియంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. వారు వాడిన వస్తువులను ఈ మ్యూజియంలో భద్రపర్చుతున్నామన్నారు. పీవీ విగ్రహాం, ల్యాండ్ స్కేపింగ్ తో సిట్టింగ్ బెంచేస్. గజీ బోస్, మంచీనీటి వసతి, పాత్ వే లను 75.00 లక్షల రూపాయలతో  అభివృద్ది చేస్తున్నామన్నారు.
 
టోటల్ ప్రాజేక్టు వ్యయం 1098.45 లక్షలతో వంగరలోని పీవీ విజ్ఞాన వేదికను నిర్మిస్తున్నామన్నారు. జి వో ఆర్ టి నెంబర్ 22 ప్రకారం రూ. 7 కోట్ల రూపాయలను తోలిదశ పనుల కోసం కేటాయించామన్నారు. ఇప్పటికే టెండర్లు ను పిలిచామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ కార్యక్రమములో పర్యాటకాబివృద్దిసంస్థ ఎండి మనోహర్, టూరిజం అధికారులు రామకృష్ణ, కన్సల్టేంట్లు పాల్గోన్నారు. 

More Press Releases