గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుటకు విస్తృత ఏర్పాట్లు చేయండి: తెలంగాణ సీఎస్

Related image

హైదరాబాద్: జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుటకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం బిఆర్ కెఆర్ భవన్ లో వివిధ శాఖల అధికారులతో ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు.

కరోనా వైరస్ నివారణ చర్యలను కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం చర్యలు తీసుకొని, శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. సెక్యూరిటీ, ట్రాఫిక్ నిర్వహణ, బారీకేడింగ్, మెడికల్ టీమ్స్, మాస్క్, శానిటైజేషన్ కు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలన్నారు.
   
ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్, సెక్రటరీ టు గవర్నర్ సురేంద్ర మోహన్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, Wg Cdr Jamal A Nasir, Group Captain, OC (Unit), College of Air Warfare, హైదరాబాద్ బెటాలియన్స్, టిఎస్ఎస్పి అడిషనల్ డీజీపీ, అభిలాష్ బిష్త్, జాయింట్ సెక్రటరీ ప్రొటోకాల్ అర్విందర్ సింగ్, కల్నల్ భూపేంధర్, Lieutenant కల్నల్ పవన్ కుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయండి: సీఎస్
సచివాలయ స్థాయి నుండి జిల్లా స్థాయి కార్యాలయాల వరకు అన్ని విభాగాలలో పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, డిపిసిలను నిర్వహణ తదితర పనులు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో వివిధ శాఖలలో పదోన్నతుల ప్రక్రియపై సమీక్షించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి శాఖలో పదోన్నతులపై సమీక్షించి, ఈ ప్రక్రియకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నందున, పదోన్నతులలో ఉండే సాంకేతిక సమస్యలను పరిష్కరించి మార్గదర్శకాల ప్రకారం డిపిసిలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఆర్ధిక శాఖ సీనియర్ కన్సల్టెంట్ శివ శంకర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More Press Releases