హైదరాబాద్ లో వ్యాక్సిన్ పంపిణీకి 260 కేంద్రాల ఏర్పాటు: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: ప్రపంచ దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ ను హైదరాబాద్ లోనే తయారు చేయడం మనందరికీ ఎంతో గర్వకారణం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సైకిల్ బ్రాండ్ అగర్ బత్తి ఆధ్వర్యంలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కార్యక్రమం క్రింద 5 వేల శానిటైజర్ బాటిల్స్ ను హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ కు మంత్రి అందజేశారు.

సామాజిక బాధ్యతగా శానిటైజర్ బాటిల్స్ ను అందించడం పట్ల కార్యక్రమంలో పాల్గొన్న సైకిల్ బ్రాండ్ అగర్ బత్తి తెలంగాణ ఏరియా మేనేజర్ కొండా శ్రీనివాస్ ఇతర ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఎప్పటి కప్పుడు అధికారులతో సమీక్షలు జరుపుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజలు కూడా తప్పని సరిగా మాస్క్ ను ధరించి, సామాజిక దూరం పాటించాలని కోరారు.

హైదరాబాద్ లో వ్యాక్సిన్ పంపిణీ కి 260 కేంద్రాల ఏర్పాటు: మంత్రి తలసాని


కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం హైదరాబాద్ లో 260 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ వెంకట్ తో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతగా ప్రైవేట్, ప్రభుత్వ వైద్య సిబ్బంది 78,226 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయని, ఒక్కో కేంద్రంలో 5గురు వైద్య సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన డ్రై రన్ (ట్రయల్స్) నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

More Press Releases